Posts

Showing posts from August, 2019

UP lineman cuts police station power supply|telugu news|ciniwala|uplineman

Image
పోలీస్ స్టేషన్‌కు కరెంట్ కట్ చేసిన లైన్‌మ్యాన్.. భలే రివేంజ్! రూ ల్‌కు రూల్‌తో సమాధానం ఇచ్చాడు ఆ ఎలక్ట్రీషియన్. పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిపేసి ఝలక్ ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన లైన్‌మ్యాన్ శ్రీనివాస్ ఓ రోజు విద్యుత్తు లైన్లు తనిఖీ చేయడానికి బైక్ మీద వెళ్లాడు. దారి మధ్యలో పోలీసులు అతడిని అడ్డుకుని హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తున్నందుకు ఫైన్ చెల్లించాలన్నారు తాను ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నానని, విధుల్లో భాగంగా లైన్ తనిఖీలు చేస్తున్నానని తెలిపాడు. అనంతరం జూనియర్ ఇంజినీర్‌కు ఫోన్ చేసి ఎస్‌ఐ రమేష్ చంద్రతో మాట్లాడించాడు. ఏది ఏమైనా ఫైన్ కట్టాల్సిందేనని ఎస్‌ఐ స్పష్టం చేశాడు. దీంతో శ్రీనివాస్ ఫైన్ కట్టాడు. ఈ సందర్భంగా ఎస్‌ఐ.. అతడికి ట్రాఫిక్ నిబంధనలు గురించి వివరించాడు.  తాను అంతగా ప్రాధేయపడినా పోలీసులు వదిలిపెట్టకపోడంతో శ్రీనివాస్ బాధపడ్డాడు. రూల్‌కు రూల్‌తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా తన సహచరులతో కలిసి ఆ జిల్లాల్లో విద్యుత్ బిల్లులు చెల్లించని పోలీస్ స్టేషన్ల జాబితా తయారు చేశాడు. వాటిలో తనక