Anushka is also follow Prabhas | Telugu film news | ciniwala | Anushka

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఎంత పాపులర్ అయ్యాడో అందరికి తెలిసినదే, ఆ పాపులారిటీ తో దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు, అతి తక్కువ సమయంలోనే ఎక్కువమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు , ప్రభాస్ అయితే ఈ సినిమాలో నటించిన మిగిలిన నటీనటులు కూడా కాస్తో కూస్తో పాపులారిటీని, ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నప్పటికీ అది తమ తరువాతి సినిమాలకి పెద్దగా ఉపయోగపడలేదు, కానీ అనుష్క మాత్రం ప్రభాస్ రేంజ్ లో కాకపోయినా తనకి దగ్గరగా అభిమానులను సొంతం చేసుకుంది, బాహుబలి లో అనుష్క చేసిన నటనకి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు, దెబ్బతో ఆమె కూడా పాపులర్ అయిపొయింది, ఇక ఈ పాపులారిటీ ని ప్రభాస్ అనుష్క ఇద్దరు కూడా తమ నెక్స్ట్ సినిమాలకు వాడుకొనే పనిలో పడ్డారు, ఇప్పటికే ప్రభాస్ బాహుబలి తో వచ్చిన క్రేజ్ ని పోనివ్వకుండా సాహూ సినిమాతో నిరూపించుకుంటున్నాడు, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నా సాహూ సినిమా ఇప్పటికే టీజర్ ని విడుదల చేసి ఇక్కడే కాదు బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు అంత కాలేకపోయిన కొంచెం అయినా బాహుబలి క్రేజ్ ని అనుష్క కూడా ఉపయోగించుకోవాలని చూస్తుందట. ప్రభాస్‌లా భారీ సినిమా చేయలేకపోయినా అనుష్క కూడా తన మలి చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ భాషలలో చేస్తోంది. నిశ్శబ్దం అనే పేరుతొ అనుష్క చేస్తున్న సినిమా అన్ని భాషల్లో కనెక్ట్ అయ్యేలా ఉందట అందుకే ఈ సినిమాని అన్ని భాషల్లో విడుదల చెయ్యాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తుంది. బాహుబలి సినిమా రాకముందు తెలుగు తమిళ్, హిందీ లో అనుష్క మార్కెట్ కొంచమైనా ఉంది, ఇక ఇప్పుడు ఆ మార్కెట్ తన సినిమాకి బాగానే పనికొస్తుంది, ఈ చిత్రంలో నటించడం కోసం కష్టపడి సహజ పద్ధతులలో బరువు తగ్గిన అనుష్క అహర్నిశలు శ్రమిస్తూ షూటింగ్‌ చేస్తోంది. మొన్న ఈమధ్య కాలంలోనే మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి సగానికి పైనే పూర్తీ చేసుకుందట, త్వరగా షూటింగ్ పూర్తీ చేసుకొని అక్టోబర్ లో ఈ సినిమా ని విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట.. మొత్తానికి అనుష్క ప్రభాస్ ని ఫాలో అయిపోతుంది.

Comments

Popular posts from this blog

Samantha and Chinmayi dragged netizens into Bigg Boss conflict| Telugu film news | ciniwala | samantha

Prime Minister Modi Vs Rahul|telugu news|modi|rahul|