Prime Minister Modi Vs Rahul|telugu news|modi|rahul|



లోక్‌సభలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న ప్రధాని మోదీ, రాహుల్

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. రాహుల్ వ్యాఖ్యలకు మోదీ దీటుగా బదులిచ్చారు

బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ ఛౌదురిపై విరుచుకుపడ్డారు. ‘మరో ఆరు నెలల్లో ప్రధానిని దేశంలోని యువత తరిమి తరిమి కొడతారని ప్రతిపక్షానికి చెందిన ఎంపీ అంటున్నారు.. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను.. మీరు మరిన్ని సూర్య నమస్కారాలు చేయండి.. ఇవి వేధింపులు ఎదుర్కోవటానికి నన్ను మరింత బలంగా చేస్తుంది... ఏదేమైనా, గత రెండు దశాబ్దాలుగా నాపై చేస్తున్న దుష్ప్రచారంతో మరింత రాటుదేలాను’ అని మోదీ విమర్శలు గుప్పించారు.
దేశంలోని యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన ప్రధాని మోదీని యువత తరమి కొడతారని రాహుల్ చేసిన విమర్శలకు మోదీ పై విధంగా స్పందించారు. ప్రధాని తన నివాసం నుంచి బయటకు రాలేరు.. దేశంలోని యువత ఆయనను కర్రలతో కొట్టి తరముతారు.. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ దేశం పురోగతి సాధించదనే విషయం అప్పుడు అర్థమవుతుంది అంటూ రాహుల్ దుయ్యబట్టారు.

అంతకు ముందు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ ఛౌదురికి మోదీ చురకలంటించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ప్రారంభించిన ఫిట్ ఇండియాకు అధిర్ రంజ్ విశేష ప్రచారం చేస్తున్నారని, ఆయనకు ధన్యవాదాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన ప్రసంగంలోనూ జిమ్ విన్యాసాలు కూడా చేస్తారు.. తమ ప్రభుత్వ పథకాన్ని ప్రమోట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు అని మోదీ చలోక్తులు విసిరారు. గత 70 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో ఏ కాంగ్రెస్ నేత స్వయం సమృద్ధి సాధించలేదని విమర్శించారు. ప్రధాని ప్రసంగానికి అధిర్ రంజన్ పదే పదే అడ్డుతగలడంతో మోదీ ఆయనపై విమర్శలు గుప్పించారు.

Comments

Popular posts from this blog

Samantha and Chinmayi dragged netizens into Bigg Boss conflict| Telugu film news | ciniwala | samantha

Anushka is also follow Prabhas | Telugu film news | ciniwala | Anushka