Anusuya on the web series |telugu film news|ciniwala|anusuya






జబర్దస్త్ షో వలన బుల్లితెరపైన మంచి ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుందని యాంకర్ అనసూయ, ఈ షో కి ఆమె గ్లామర్ బాగా ప్లస్ అయ్యింది , ఎంట్రీ సాంగ్ తో రచ్చ రచ్చ చేస్తుంది, చిట్టి పొట్టి డ్రెస్సెస్ ధరించి ప్రేక్షకులకు మత్తెక్కిస్తోంది, దాంతో బుల్లితెరపైన మరిన్ని షోస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తుంది, అయితే అనసూయ తన హవాని ఒక బుల్లితెరపైనే కాదు వెండితెరపైన కూడా కొనసాగించాలని చూసింది, అందుకే అక్కడ కూడా అడుగు పెట్టేసింది, అడపాదడపా సినిమా అవకాశాలు చేజిక్కించుకుంటుంది గతేడాది సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి అందరిని అల్లాడించింది, ఆ ఒక్క పాత్రతో మంచి మైలేజ్ ని సొంతం చేసుకుంది, దెబ్బతో ఆఫర్స్ పైన ఆఫర్స్ ని చేజిక్కించుకుంది, కానీ అనసూయ కి రంగస్థలం ఇచ్చినంత మైలేజ్ మరో సినిమా ఇవ్వలేదు, దాంతో ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న వెబ్ సిరీస్ పైన అనసూయ కన్నేసిందట. ఇప్పుడు అందరు కూడా వెబ్ సిరీస్ వైపే చూస్తున్నారు , సినిమాల కంటే ఎల్కువగా జనాలు కూడా అదే ఆదరించడంతో అందరు వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తున్నారు , ఇదే నేపథ్యంలో అనసూయ కూడా వెబ్ సిరీస్ చెయ్యాలని నిర్ణయం తీసుకుందట. ఇండస్ట్రీ లో కూడా మంచి కధ మంచి ఇన్స్పిరేషనల్ పాత్ర ఏదైనా వస్తే అది కూడా చేస్తానని చెప్పుకొచ్చింది అనసూయ. మొత్తానికి ఒకవైపు బుల్లితెర మరోవైపు వెండితెర అన్నింటిని కవర్ చేసేస్తుంది. ఒక చిన్న యాంకర్ గా ఇంస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇంతటి మైలేజ్ ని సొంతం చేసుకోవడం అంటే మాటలు కాదు అది అనసూయకి తక్కువ సమయంలోనే దొరికింది.

Comments

Popular posts from this blog

Samantha and Chinmayi dragged netizens into Bigg Boss conflict| Telugu film news | ciniwala | samantha

Anushka is also follow Prabhas | Telugu film news | ciniwala | Anushka

Prime Minister Modi Vs Rahul|telugu news|modi|rahul|