Because of Nagarjuna is keen to come to Bigg Boss Show |telugu film news|ciniwala|nagarjuna




బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నట్లు ఉంది. అందుకే బిగ్ బాస్ సీజన్ 3 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూపులు చూస్తున్నారు. బిగ్ బాస్ కి బుల్లితెరపైన ఇంతటి ఆదరణ లభించడానికి ఒక రకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కారణమని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి షో పైన మంచి హైప్ క్రియేట్ చేశారు, టాప్ రేటింగ్ లో దూసుకుపోయేలా చేశారు. వచ్చేది వారానికి రెండు రోజులే అయినప్పటికీ ఆ వారం మొత్తం ప్రేక్షకులకు అలాగే హౌస్ మేట్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసి వెళ్ళేవారు. దాంతో షో మంచి రసవత్తరంగా సాగింది, మొత్తానికి బిగ్ బాస్ ని ఒక రేంజ్ లో నిలబెట్టారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇకపొతే సెకండ్ సీజన్ నాని వ్యాఖ్యాత గా వ్యవహరించి మంచి మైలేజ్ నే తెచ్చిపెట్టినప్పటికీ ఎన్టీఆర్ తరహాలో షో ని రక్తి కట్టించలేకపోయారు. రేటింగ్ కాస్త తగ్గినట్లుగానే కనిపించింది, అంతకుమించి నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ ఎఫెక్ట్ అతనికి బాగా కొట్టింది, తన సినిమాలపైనా ఆ ప్రభావం కనిపించడంతో మూడవ సీజన్ ససేమీరా చెయ్యడానికి ఒప్పుకోలేదు నాని.
దాంతో మూడవ సీజన్ కి ఎవరు హోస్ట్ గా వస్తారా అని అభిమహలు ఎదురు చూశారు. ఇక ఇప్పుడు ఆ ఎదురు చూపులకు కింగ్ నాగార్జున చెక్ పెట్టేసారు, మూడవ సీజన్ తనే వ్యాఖ్యాతగా నిలిచి షో ని నడిపించనున్నారు. ఇప్పటికి ప్రోమో కూడా విడుదల చేశారు మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటె ఇప్పుడు అందరు దృష్టి బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ పైనే ఉంది. సోషల్ మీడియాలో రోజుకొక లిస్ట్ వైరల్ అవుతున్నప్పటికీ అందులో నిజానిజాలు బయటకి రావడం లేదు దాంతో కంటెస్టెంట్స్ ఎవరనేది ఇప్పటికి క్వషన్ మార్క్ లాగే ఉంది. అయితే మూడవ సీజన్ లో పాల్గొనడానికి ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదట దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు కానీ చాలామంది మాత్రం షో లో పాల్గొనడానికి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మరి కొంతమంది మాత్రం బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ పాల్గొనడానికి కారణం నాగార్జున కారణం అని చెప్పుకొస్తున్నారు. అతన్ని చూసే ఈ షోలో పాల్గొనడానికి ముందడుగు వేస్తున్నారని టాక్. అయితే వారెవరో మరి కొన్ని రోజుల్లో తెలియయనున్నది. బిగ్ బాస్ మూడవ సీజన్ 100 రోజులు, 14 మంది కంటెస్టెంట్స్, జులై 21 గెట్ రెడీ.



























Comments

Popular posts from this blog

Samantha and Chinmayi dragged netizens into Bigg Boss conflict| Telugu film news | ciniwala | samantha

Anushka is also follow Prabhas | Telugu film news | ciniwala | Anushka

Prime Minister Modi Vs Rahul|telugu news|modi|rahul|