Fine to Roy who questioned the umpire's mistake|telugu news|ciniwala|Eng vs Aus|Jason roy


హైలైట్స్
  • అంపైర్‌తో కాసేపు వాదనకు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్‌ జేసన్ రాయ్
  • లెగ్‌ సైడ్‌ వైడ్‌గా వెళ్లిన బంతికి ఔటిచ్చిన అంపైర్ ధర్మసేన
  • అప్పటికే డీఆర్‌ఎస్ అవకాశాన్ని చేజార్చుకున్న ఇంగ్లాండ్
  • న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్‌లో వరల్డ్‌కప్ ఫైనల్                                                                                                          



ఆస్ట్రేలియాతో బర్మింగ్‌హామ్ వేదికగా గురువారం రాత్రి ముగిసిన వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌లో అంపైర్ తప్పిదాన్ని ప్రశ్నించిన ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌కి జరిమానా పడింది. ఈ మ్యాచ్‌లో 224 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు.. ఓపెనర్ జేసన్ రాయ్ (85: 65 బంతుల్లో 9x4) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 32.1 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. అయితే.. శతకం ముంగిట జేసన్ రాయ్ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. బ్యాట్‌కి బంతి తాకకపోయినా.. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగా.. కాసేపు క్రీజులో నిరసన తెలిపిన జేసన్‌ రాయ్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు.

అసలు ఏం జరిగిందంటే..? ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ షార్ట్ పిచ్ బంతిని విసిరాడు. దీంతో.. ఫుల్ చేసేందుకు జేసన్ రాయ్ ప్రయత్నించగా.. బంతి బ్యాట్ పక్క నుంచి వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. దీంతో.. క్యాచ్ ఔట్ కోసం ఆస్ట్రేలియా ఫీల్డర్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన వేలెత్తేశాడు. దీంతో ఆశ్చర్యపోయిన జేసన్ రాయ్.. బంతి బ్యాట్‌కి తాకలేదంటూ క్రీజులోనే కాసేపు నిరసన తెలిపి అనంతరం పెవిలియన్‌వైపు నడిచాడు. అంతకముందే ఓపెనర్ జానీ బెయిర్‌స్టో.. ఇంగ్లాండ్‌ టీమ్‌కి ఉన్న ఏకైక డీఆర్‌ఎస్ అవకాశాన్ని చేజార్చాడు. దీంతో.. రివ్యూ అడిగే అవకాశం కూడా రాయ్‌కి లేకపోయింది.

అంపైర్ నిర్ణయంపై క్రికెటర్ అసంతృప్తి లేదా నిరసన తెలపడం క్రమశిక్షణరాహిత్యం కిందకే వస్తుంది. దీంతో.. మైదానంలో నిరసన తెలిపిన జేసన్ రాయ్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించిన మ్యాచ్ రిఫరీ.. అతని ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లను కూడా చేర్చాడు. కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓ క్యాచ్‌ని జారవిడిచిన జేసన్ రాయ్ అతి ప్రవర్తనతో ఒక డీమెరిట్ పాయింట్‌ను పొందాడు. మొత్తంగా ఇప్పుడు అతని ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్స్ ఉన్నాయి. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం.. రెండేళ్ల వ్యవధిలో ఆటగాడి ఖాతాలో డీమెరిట్ పాయింట్ల సంఖ్య నాలుగుకి చేరితే అతనిపై మ్యాచ్‌ల నిషేధం అమలులోకి రానుంది. 
 
















\

Comments

Popular posts from this blog

Samantha and Chinmayi dragged netizens into Bigg Boss conflict| Telugu film news | ciniwala | samantha

Anushka is also follow Prabhas | Telugu film news | ciniwala | Anushka

Prime Minister Modi Vs Rahul|telugu news|modi|rahul|