Jaggubhai Clarity on the movie| Telugu film news | ciniwala |sarileru neekevvaru



మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు.. ఆర్మీ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఐతే.. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తి బాబును ఎంచుకున్నారు. ఐతే ఇటీవ‌ల ఆ సినిమా నుంచి జ‌గ‌ప‌తిబాబు త‌ప్పుకున్నారు. జగ్గూభాయ్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం వెనక అనిల్ రావిపూడితో ఉన్న విభేదాలే కారణమని వార్తలు వినబడ్డాయి. తాజాగా ఈ పుకార్లుకు పులిస్టాప్ పెడుతూ.. దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు జగపతి బాబు క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమై జగపతి బాబు ఓ వీడియోను విడుదల చేసాడు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో తాను ఒక క్యారెక్టర్ చేయాల్సి ఉన్న.. పర్సనల్ కారణాలతో స్వచ్ఛందంగా ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. నేను నా 33 ఏళ్ల కెరీర్‌లో ఎవరితో గొడవ పడింది లేదంటూ ఓ వీడియోను విడుదల చేసాడు.
మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘సరిలేరు నీకెవ్వ‌రు’ సినిమాలోని పాత్ర‌ను జ‌గ‌ప‌తిబాబు చాలా ఇష్ట‌ప‌డ్డారు. ఈ ప్రాజెక్టులో భాగం కావాల‌ని ఆయ‌న భావించారు. అయితే కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆయ‌న సినిమా నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే జ‌గ‌ప‌తిబాబుగారితో ప‌నిచేసే అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేసాడు. ప‌రిస్థితిని అర్థం చేసుకున్నందుకు ధ‌న్య‌వాదాలు స‌ర్` అంటూ జగపతి బాబును ఉద్దేషిస్తూ అనిల్ ట్వీట్ చేశాడు. మొత్తానికి సరిలేరు నీకెవ్వరు సినిమాలో జగపతి బాబు తొలగింపు జరుగుతున్న ప్రచారాలకు వీళ్లిద్దరు చెక్ పెట్టారు.

Comments

Popular posts from this blog

Samantha and Chinmayi dragged netizens into Bigg Boss conflict| Telugu film news | ciniwala | samantha

Anushka is also follow Prabhas | Telugu film news | ciniwala | Anushka

Prime Minister Modi Vs Rahul|telugu news|modi|rahul|